ఖమ్మం: ఉపకరణాలకు దరఖాస్తులు చేసుకోవాలి

84చూసినవారు
ఖమ్మం: ఉపకరణాలకు దరఖాస్తులు చేసుకోవాలి
ఖమ్మం జిల్లాలోని దివ్యాంగులు అవసరమైన సహాయ ఉపకారణాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ అధికారి రామ్ గోపాల్ రెడ్డి కోరారు. అర్హత కలిగిన వారు ఈ నెల 18లోపు https: //tsobmms. cgg. gov. inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్ లైన్ దరఖాస్తుతో పాటు సంబంధిత ధ్రువపత్రాలను కలెక్టరేట్ లోని తమ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్