ఖమ్మం: మెడికల్ కాలేజీలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు

41చూసినవారు
ఖమ్మం: మెడికల్ కాలేజీలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు
ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 84 పోస్టుల భర్తీకి నవంబర్ 13లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ డాక్టర్ శంకర్ సూచించారు. కళాశాలలో 12 మంది ప్రొఫెసర్లు, 26మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, ఎనిమిది మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 36మంది సీనియర్ రెసిడెంట్లు, ఇద్దరు ఐసీయూ స్పెషలిస్టులను కాంట్రాక్టు పద్ధతిలో నియమించనున్నట్లు తెలిపారు. ఆసక్తి, అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకుంటే, నవంబర్ 15న ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్