2024-25 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదువుతున్న బీసీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఈ-పాస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జి. జ్యోతి తెలిపారు. విద్యార్థులు telanganaepass.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుని, ఆదాయం, కుల ధ్రువపత్రాలు, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్ జతపరచాలని సూచించారు. దరఖాస్తు కాపీకి సర్టిఫికెట్లు జత చేసి తమ కార్యాలయంలో అందజేయాలని తెలిపారు.