జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి ముజాహిద్ తెలిపిన వివరాల ప్రకారం, విదేశీ విద్యా పథకం కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ పథకం ద్వారా విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు ఎంపికైన విద్యార్థులకు ఆర్థిక సాయం అందుతుంది. డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులు సాధించి, ఈ ఏడాది జనవరి 1 నుంచి జూన్ 30 మధ్య విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందిన వారు అర్హులు. అర్హులైన
విద్యార్థులు ఈ నెల 30లోగా www.telanganaepass.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల పరిశీలన అనంతరం ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు.