ఖమ్మం: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

1చూసినవారు
ఖమ్మం: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
యూపీఎస్సీ సీశాట్ పరీక్షకు సిద్ధమవుతున్న 100మంది మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖాధికారి ముజాహిద్ తెలిపారు. మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పించడంతో పాటు మహిళలకు 33.33%, దివ్యాంగులకు 5% సీట్లు రిజర్వ్ చేస్తారు. ప్రొఫెషనల్ డిగ్రీ పూర్తి చేసి, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 5 లక్షల్లోపు ఉన్న మైనార్టీ అభ్యర్థులు https: cet.cgg.gov.in/tmresis వెబ్ సైట్ ద్వారా ఈనెల 31 వరకు దరఖాస్తు చేసుకోవాలి. వచ్చే నెల 14న ప్రవేశ పరీక్ష నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తారు.

సంబంధిత పోస్ట్