ఖమ్మం జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మహమ్మద్ ముజాహిద్ గురువారం ఒక ప్రకటనలో, విదేశాల్లో ఉపాధి అవకాశాల కోసం మైనారిటీ నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. టామ్ కామ్ ద్వారా ఆస్ట్రేలియా, ఒమన్, జర్మనీ, ఖతర్, గ్రీస్ దేశాల్లో పలు ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 20 లోపు కలెక్టరేట్‌లో దరఖాస్తులు సమర్పించాలని, మరిన్ని వివరాలకు 97040 03002 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.