ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో ఆర్థికశాస్త్రం బోధించడానికి ఒక అధ్యాపక పోస్టుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ డా. మహ్మద్ జకీరుల్లా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 6వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ధ్రువపత్రాలను కళాశాల కార్యాలయంలో సమర్పించాలి. 7వ తేదీన ఉదయం 11 గంటల నుంచి కళాశాలలో ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయి. సంబంధిత పీజీ సబ్జెక్టులో 55 శాతం మార్కులు, నెట్, సెట్, పీహెచ్డీ, లేదా డిగ్రీ బోధనానుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.