మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్, జిల్లాలోని యువజన సంఘాలను రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రిజిస్ట్రేషన్ ద్వారా స్వచ్ఛంద, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేలా సంఘాలను బలోపేతం చేయవచ్చని తెలిపారు. 18-29 ఏళ్ల సభ్యులున్న సంఘాల బాధ్యులు ఈనెల 30లోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.