ఖమ్మం కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డితో కలిసి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలు ఇచ్చే దరఖాస్తులు పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ ఫిర్యాదును పరిశీలించి పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ దీక్షారైనా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.