ఖమ్మం: నియోజకవర్గాలకు ప్రత్యేకాధికారుల నియామకం

78చూసినవారు
ఖమ్మం: నియోజకవర్గాలకు ప్రత్యేకాధికారుల నియామకం
ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల పటిష్ట అమలుకు నియోజకవర్గ ప్రత్యేక అధికారులను నియమించినట్లు జిల్లా ఇంచార్జీ కలెక్టర్ డా. శ్రీజ తెలిపారు. ఖమ్మంకు జడ్పీ సీఈఓ దీక్షా రైనా, పాలేరుకు డీఆర్ఓ రాజేశ్వరి, మధిరకు జిల్లా పంచాయతీ అధికారిణి ఆశాలత, వైరాకు డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు, సత్తుపల్లికి ఎల్. రాజేంద్ర గౌడ్ ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్