ఖమ్మం: వరదలను తట్టుకునేలా ఏర్పాట్లు చేయాలి

72చూసినవారు
ఖమ్మం: వరదలను తట్టుకునేలా ఏర్పాట్లు చేయాలి
వర్షాకాలంలో వచ్చే మున్నేరు వరదలను తట్టుకునేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య అధికారులకు సూచించారు. ఈమేరకు మంగళవారం ఖమ్మం కేఎంసీ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లా డారు. గతేడాది వచ్చిన వరదల కారణంగా ఇబ్బంది పడిన ప్రాంతాలపై పునఃసమీక్షించారు. ఈసందర్భంగా వరదల సమయాన ఎలాంటి సహాయక చర్యలు చేపట్టాలి, వరదల తర్వాత చేపట్టాల్సిన చర్యలపైన అధికారులతో చర్చించారు.

సంబంధిత పోస్ట్