ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం తాళ్లగూడెం గ్రామంలోని శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి దేవస్థానంలో ఆదివారం ఆషాడ మాస శాకాంబరి అలంకరణ శోభాయమానంగా జరిగింది. దీక్ష స్వాములు సారే చీరలతో అమ్మవారికి బోనాలను అర్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.