ఖమ్మం: సీజేఐపై దాడి దుర్మార్గపు చర్య

12చూసినవారు
ఖమ్మం: సీజేఐపై దాడి దుర్మార్గపు చర్య
విశ్వాసాల ముసుగులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ పై దాడి చేయడం దుర్మార్గపు చర్య అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. ఖమ్మం ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని గౌరవించని వారు, చట్టాలకు విలువ ఇవ్వని వారు దేశద్రోహులుగా మిగిలిపోతారని తెలిపారు. దళితులపై వివక్ష, అంటరానితనం, దాడులు, హత్యలు, లైంగికదాడులు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :