గత నెల 23న వైద్య సదస్సు కోసం దుబాయ్ వెళ్లిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పెద్ద అల్లుడు డాక్టర్ కల్యాణ్ శేఖర్‌కు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆయనను పరామర్శించడానికి దుబాయ్ వెళ్లిన తుమ్మల, గల్ఫ్ యుద్ధం కారణంగా విమానాలు రద్దు కావడంతో అక్కడే చిక్కుకుపోయారు. మంగళవారం సాయంత్రం నుండి విమాన రాకపోకలు పునఃప్రారంభం కావడంతో, రాష్ట్ర అధికారులు మంత్రి తుమ్మలను సురక్షితంగా హైదరాబాద్‌కు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.