ర్యాపిడో, ఓలా వంటి యాప్‌ల వల్ల తమ ఆటో వ్యవస్థ దెబ్బతింటుందని పలువురు ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఖమ్మం పెవీలియన్ గ్రౌండ్‌లో ఐఎన్టీయుసీ ఆధ్వర్యంలో మూడు వేలకు పైగా ఆటోలతో భారీ ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆటో కార్మికులకు రూ. 12వేలు ఆర్థిక సహాయం చేయాలని కోరారు. ఉచిత బస్సు సర్వీసుల వల్ల తమకు ఆదాయం లేకుండా పోయిందని, వాటిని వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.