ఖమ్మం: బాబు జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివి

85చూసినవారు
ఖమ్మం: బాబు జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివి
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘసంస్కర్త, భారత నాలుగో ఉప ప్రధాని డా. బాబు జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివని డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కార్పొరేషన్ చైర్మన్ రాయలతో కలిసి నివాళులర్పించారు. దేశానికి చేసిన ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.