రాష్ట్రంలో ప్రాణాంతకమైన 'పారాక్వాట్' కలుపు నివారణ రసాయనంపై నిషేధం విధించాలని తెలంగాణ శాసన సభ సోమవారం ఏకగ్రీవంగా తీర్మానించింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రవేశపెట్టిన ఈ తీర్మానం ప్రకారం, రైతుల ఆరోగ్యం, పర్యావరణానికి ముప్పుగా మారిన ఈ రసాయనం తయారీ, దిగుమతి, విక్రయాలను నిలిపివేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ రసాయనం వల్ల జరుగుతున్న ప్రాణనష్టాన్ని నివారించేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.