తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం బార్ అసోసియేషన్ నుంచి 990 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఖమ్మం నుంచి మందడపు శ్రీనివాసరావు, చిలుకూరి స్వర్ణకుమారి, తాళ్లూరు దిలీప్, మర్రి ప్రకాష్ రావు బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. శుక్రవారం ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఖమ్మం కోర్టు ఆవరణలో పోలింగ్ జరుగుతుందని పోలింగ్ అధికారి తోండపు వెంకటేశ్వరరావు తెలిపారు.