ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ ప్రొఫైల్ సృష్టించి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ తెలిపారు. నకిలీ ఖాతా ద్వారా ఎవరైనా అధికారి పేరుతో ఫోన్ చేసి డబ్బులు అడిగితే స్పందించవద్దని, ఆన్‌లైన్ పేమెంట్లు చేయవద్దని ఆయన సూచించారు.