సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రజలు తమ ఇళ్ల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం సీపీ సునీల్ దత్ సూచించారు. ఇంట్లోని నగదు, బంగారు ఆభరణాలను వెంట తీసుకెళ్లాలని లేదా బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని ఆయన తెలిపారు. దొంగతనాల నియంత్రణకు రాత్రి గస్తీని పెంచుతున్నట్లు, తాళం వేసిన ఇళ్లపై నిఘా ఉంచుతామని, ప్రజలు తమ విలువైన వస్తువుల విషయంలో నిర్లక్ష్యం వహించకూడదని ఆయన స్పష్టం చేశారు.