ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో మాట్లాడుతూ, ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. పీహెచ్సీల్లో ఉద్యోగుల హాజరును పర్యవేక్షించి, అనుమతి లేకుండా గైర్హాజరయ్యే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్యాధికారులు ఆశా కార్యకర్తలతో సమావేశమై, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా కృషి చేయాలని తెలిపారు.