ఖమ్మం జనరల్ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ప్రజల అవసరాలకు అనుగుణంగా వసతులు మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. గురువారం ఖమ్మం కలెక్టరేట్ లో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి పనితీరు, పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు, అవసరమైన వైద్య పరికరాలు, యంత్రాలు, మౌలిక సదుపాయాలపై వైద్యులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రిలో వసతులు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని కలెక్టర్ నొక్కి చెప్పారు.