కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ భారతదేశ భవిష్యత్తును మార్చే రాజ్యాంగమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు అభివర్ణించారు. ఆదివారం ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ఈ బడ్జెట్లో తెలంగాణకు పెద్దపీట వేయడంపై హర్షం వ్యక్తం చేశారు. మధ్యతరగతి ప్రజల కష్టాలను గుర్తించి, వారి ముఖాల్లో చిరునవ్వులు పూయించేలా సంస్కరణలు చేపట్టారని కొనియాడారు.