ఖమ్మం: అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ నేతల దీపారాధన

80చూసినవారు
ఖమ్మం: అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ నేతల దీపారాధన
భారత రాజ్యంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ పార్టీ జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. గావ్ చలో-బస్తీ చలో కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఖమ్మంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం జెడ్పీ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేసి, స్వచ్చ భారత్ నిర్వహించిన పార్టీ శ్రేణులు సాయంత్రం అంబేద్కర్ విగ్రహం వద్ద దీపారాధన చేశారు.