కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే బీసీల ఎదుగుదలకు, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు గండి కొట్టే విధంగా, రాజకీయంగా అణిచివేసే విధంగా ఉన్నదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ అన్నారు. బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దొంగల సత్యనారాయణ, విద్యాసాగర్, శీలం పాపారావు, దొంతు జ్వాలా ఉన్నారు.