ఖమ్మం రూరల్ మండలంలోని ఎం. వెంకటాయపాలెం శివారు కాచిరాజుగూడెం వైపు వెళ్లే ఖమ్మం మహబాబూబాబాద్ ప్రధాన రహదారి పక్కన ఓ వెంచర్లో గుర్తు తెలియని వ్యక్తి (40) మృతదేహాన్ని సోమవారం రాత్రి గుర్తించారు. వాహనదారులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, అన్నం ఫౌండేషన్ సహకారంతో మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరణం ప్రమాదవశాత్తు జరిగిందా లేక హత్యకు గురయ్యాడా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.