ఖమ్మం: బావిలో పడి బాలుడు మృతి

12చూసినవారు
ఖమ్మం: బావిలో పడి బాలుడు మృతి
వేసవి సెలవుల్లో తల్లితో కలిసి మేకలు కాసేందుకు వెళ్లిన ఐదో తరగతి విద్యార్థి బచ్చలకూరి దీపక్ శ్రీనాథ్, కారేపల్లి మండలం పేరుపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన మల్లన్న గూడెం మూలమలుపు వద్ద చోటుచేసుకుంది. ఆడుకుంటూ బావిలో పడిపోయిన బాలుడు అక్కడికక్కడే మరణించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్