ఖమ్మం భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన వారికి బీఆర్ఎస్ నాయకులు అండగా నిలిచారు. అంబేడ్కర్ భవన్, టీటీడీసీ కేంద్రాల్లో పునరావాసం కల్పించారు. మంగళవారం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో బాధితులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తాత మధుసూదన్ మాట్లాడుతూ, ప్రభుత్వం అన్యాయంగా బాధితులను రోడ్డున పడేసిందని, జిల్లా మంత్రులు అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. బాధితులకు స్వయంగా భోజనం వడ్డించారు.