ఖమ్మం కలెక్టర్ దివాకర్ మాట్లాడుతూ, పంట అవశేషాలను కాల్చడం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లడమే కాకుండా భూసారం దెబ్బతింటుందని తెలిపారు. సమీప పంటలు, ఆస్తులు, విద్యుత్ లైన్లు కూడా దెబ్బతింటున్నాయని ఆయన పేర్కొన్నారు. రైతులు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు పంట అవశేషాలను కాల్చకుండా, రోటోవేటర్ ద్వారా నేలలో కలియదున్నాలని సూచించారు. దీనివల్ల భూమి సారవంతమవుతుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.