ఖమ్మం బస్టాండ్ ను పరిశుభ్రంగా ఉంచాలి: డిఎం

3చూసినవారు
ఖమ్మం బస్టాండ్ ను పరిశుభ్రంగా ఉంచాలి: డిఎం
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ పెరగనున్న నేపథ్యంలో ఖమ్మం నూతన బస్టాండ్‌ను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని డిపో మేనేజర్ శివప్రసాద్ సూచించారు. ఆదివారం బస్టాండ్ ప్రాంగణంలో పారిశుధ్య సిబ్బందితో సమావేశమైన ఆయన, ప్లాట్‌ఫామ్‌లపై చెత్తాచెదారం లేకుండా చూడాలని, పరిసరాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లాలని ఆదేశించారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్