రఘునాథపాలెం పోలీసులు ఇద్దరు వ్యక్తులను 70 గ్రాముల గంజాయి ఆయిల్ తో పట్టుకున్నారు. లోతుగా విచారించగా, భారీగా గంజాయి లిక్విడ్ లభ్యమైంది. స్థానిక సబ్ స్టేషన్ వెనక గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టి 70 గ్రాముల గంజాయి లిక్విడ్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, శనివారం ఆపిల్ సెంటర్ వద్ద వాహనాల తనిఖీల్లో కారులో రూ. 30 లక్షల విలువైన 2.395 కేజీల గంజాయి లిక్విడ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.