ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను లాభదాయకంగా నడపాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం ఖమ్మం కలెక్టరేట్లోని ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. క్యాంటీన్లో కలెక్టరేట్ ఉద్యోగుల డిమాండ్ ప్రకారం మెనూ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీజ, ట్రైనీ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, తదితరులు పాల్గొన్నారు.