ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రామానుజవరం సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అన్నవరం దర్శనం ముగించుకుని హైదరాబాద్ వెళ్తుండగా కారు అదుపుతప్పి బారికేడును ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో బొల్లారం పిఎస్ కానిస్టేబుల్ స్వర్ణకంటి జస్వంత్ (36) అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన భార్య జ్యోతి, కుమార్తె మాన్యకు తీవ్ర గాయాలు కాగా, నాలుగేళ్ల కుమారుడు సురక్షితంగా బయటపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.