ఖమ్మం: తప్పుడు పత్రాలతో ప్లాట్ల అమ్మకం... కేసు నమోదు

1చూసినవారు
ఖమ్మం: తప్పుడు పత్రాలతో ప్లాట్ల అమ్మకం... కేసు నమోదు
ఖమ్మం అర్బన్ పోలీసులు మంగళవారం నకిలీ డాక్యుమెంట్లతో ప్లాట్లు అమ్మి మోసం చేశారంటూ రావుల అనిల్ కుమార్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో వి. వెంకట్ రెడ్డి, టి. వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేశారు. బల్లేపల్లి ప్రాంతంలో 200 గజాల చొప్పున రెండు ప్లాట్లను తప్పుడు డాక్యుమెంట్లతో అమ్మినట్లు అనిల్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఇంటి నిర్మాణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోగా, డాక్యుమెంట్లు నకిలీవని తేలిందని ఆయన తెలిపారు. సీఐ భానుప్రకాశ్ ఈ వివరాలు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్