ఖమ్మం: లింక్ ఓపెన్ చేస్తే నగదు స్వాహా

61చూసినవారు
ఖమ్మం: లింక్ ఓపెన్ చేస్తే నగదు స్వాహా
రఘునాథపాలెం మండలంలోని ఈర్లపూడి గ్రామానికి చెందిన శ్రీనివాసరావుకు ఆధార్ కేవైసీ పేరిట వచ్చిన లింక్ ఓపెన్ చేయడంతో, సంక్రాంతి రివార్డు పేరుతో మరో మెసేజ్ వచ్చింది. దాన్ని క్లిక్ చేయగానే ఆయన ఖాతాలోని రూ. 57,000 మాయం అయ్యాయి. అదే మండలానికి చెందిన శంకర్ తన ఫోన్‌లో ఒక యాప్ డౌన్‌లోడ్ చేసిన వెంటనే రూ. 76,000 ఖాతా నుంచి డ్రా అయినట్లు గుర్తించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్