ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో
కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కేరళ ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని యూడీఎఫ్ కూటమి విజయం సాధించడం హర్షణీయమని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బానోత్ బాలాజీనాయక్, కిలారి అనిల్ కుమార్, గంగరాజు యాదవ్, కొట్టే రాజశేఖర్, గజ్జి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.