ఖమ్మం మున్నేరుపై ప్రకాశ్ నగర్ వద్ద నిర్మించిన చెక్ డ్యామ్ తొలగింపు పనులు అధికారులు వేగవంతం చేశారు. వర్షాకాలం సమీపిస్తుండడంతో, నాలుగైదు రోజులుగా చెక్ డ్యామ్ ను పూర్తిస్థాయిలో తొలగించే పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే 70 శాతం పైగా తొలగింపు పనులు పూర్తయ్యాయి. మరో రెండు, మూడు రోజుల్లో పూర్తిగా తొలగించే అవకాశాలు ఉన్నాయి. నిర్మాణ వ్యర్థాలను అక్కడే లోతట్టు ప్రాంతాల్లో పోసి లెవల్ చేస్తున్నారు.