ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం మిర్చి, పత్తి ధరలు స్వల్పంగా పెరిగాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ. 19,500, కొత్త మిర్చి ధర రూ. 19,550, పత్తి ధర రూ. 8100గా నమోదైంది. గత సోమవారంతో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ. 200, కొత్త మిర్చి ధర రూ. 50, పత్తి ధర రూ. 200 పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు. రైతులు మార్కెట్ నిబంధనలు పాటించాలని సూచించారు.