ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో గురువారం మిర్చి, పత్తి ధరలు పెరిగాయి. క్వింటా ఏసీ మిర్చి, కొత్త మిర్చి ధర రూ. 19,800గా నమోదైంది. పత్తి ధర క్వింటాకు రూ. 8,100గా ఉంది. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ. 300, కొత్త మిర్చి ధర రూ. 250 పెరిగింది. పత్తి ధర స్థిరంగా కొనసాగుతోంది. రైతులు మార్కెట్ నిబంధనలు పాటించాలని సూచించారు.