ఖమ్మం: నేడు స్తంభాద్రి గిరి ప్రదక్షిణ

83చూసినవారు
ఖమ్మం: నేడు స్తంభాద్రి గిరి ప్రదక్షిణ
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా సోమవారం సాయంత్రం 5: 30 గంటలకు ఖమ్మం నగరంలోని శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం(గుట్ట) చుట్టూ గిరి ప్రదక్షిణ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవమూర్తులతో గిరి ప్రదక్షిణ చేస్తారు. అనంతరం కొండపై ఏర్పాటుచేసిన ప్రత్యేక వేదికపై అర్చకులు, వేద పండితులు స్వాతి నక్షత్ర జ్యోతిని వెలిగిస్తారు.

సంబంధిత పోస్ట్