శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా, ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఫిబ్రవరి 28వ తేదీ వరకు సిటీ పోలీస్ యాక్ట్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సీపీ సునీల్ దత్ తెలిపారు. ఈ ఆంక్షల నేపథ్యంలో, అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు నిర్వహించరాదని ఆయన సూచించారు. అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. ఈ ఆంక్షలు ప్రజల భద్రత కోసమేనని స్పష్టం చేశారు.