ఖమ్మంలో సోమవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి హామీలు అమలుచేయకుండా, రిజర్వేషన్లలో బీసీలను మోసం చేశారని ఆరోపించారు. జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నా అభివృద్ధి జరగలేదని, పంచాయతీ ఎన్నికల వేళ సీఎం పర్యటనతో ప్రజలపై ప్రభావం చూపడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి పర్యటనను వెంటనే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.