పద్మశ్రీ వనజీవి రామయ్య మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి శనివారం సంతాపం తెలిపారు. ఒక వ్యక్తిగా మొక్కలు నాటడం ప్రారంభించి మొత్తం సమాజాన్ని ప్రభావితం చేసిన పద్మశ్రీ రామయ్య మరణం ఈ సమాజానికి తీరని లోటు అన్నారు. వనజీవి రామయ్య చూపించిన మార్గం ఎన్నో తరాలకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. మనందరం ఆయన చూపించిన మార్గాన్ని అనుసరిస్తేనే ఆయనకు నిజమైన నివాళి అవుతుందని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ పేర్కొన్నారు.