ఖమ్మం: సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి

11చూసినవారు
హిందూ దేవతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా, బుధవారం ఖమ్మం జెడ్పీ సెంటర్ వద్ద బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని వారు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, హిందూ సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :