ఖమ్మం తెలంగాణ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ, జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షులు తాతా మధుసూదన్ మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి చేపడుతున్న జిల్లా పర్యటనలు గ్రామపంచాయతీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని, ఇది స్థానిక సంస్థల ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీయడమేనని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమలులో ఉన్నప్పటికీ, సీఎం స్వయంగా రంగంలోకి దిగి, జిల్లా కేంద్రాలలో బహిరంగ సభలు నిర్వహించి, తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరడం ఒక దుష్ట సంప్రదాయానికి తెర లేపడమేనని మండిపడ్డారు.