రాష్ట్రం ప్రస్తుతం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిబద్ధతతో పని చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రాన్ని ఆర్థికంగా, వనరుల పరంగా ఇబ్బందుల్లోకి నెట్టిందని ఆరోపించారు. కృష్ణా- గోదావరి జలాల వాటాల విషయంలో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమగ్ర దృష్టి సారించారని సోమవారం భట్టి తెలిపారు.