ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఈ నెల 2వ తేదీ (ఆదివారం) నుంచి వారం రోజుల పాటు వ్యక్తిగత సెలవులో వెళ్తున్నారు. ఆయన 10వ తేదీన తిరిగి విధుల్లో చేరనున్నారు. ఈ సెలవు కాలంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ ఇన్చార్జి కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ విషయాన్ని అధికారిక వర్గాలు వెల్లడించాయి.