హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామసభల్లో సంక్షేమ పథకాల లబ్ధిని ప్రజలకు వివరించాలని, విద్యా వ్యవస్థలో మార్పులపై అవగాహన కల్పించాలని కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రులను మెడికల్ కాలేజీలకు అనుసంధానం చేయాలని, మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు సకాలంలో బిల్లులు చెల్లించాలని కూడా ఆదేశించారు. ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఈ సదస్సులో పాల్గొన్నారు.