ఖమ్మంలో మున్నేరు నది ఉగ్రరూపం దాల్చడంతో, నదికి ఇరువైపులా ప్రజలను అప్రమత్తం చేశారు. సహాయక చర్యల్లో భాగంగా నయాబజార్ స్కూల్, నయాబజార్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తనిఖీ చేశారు. అక్కడ ప్రజలకు కల్పించిన వసతులు, భోజన నాణ్యత, హెల్త్ క్యాంప్‌లను పరిశీలించి, స్థానిక ప్రజలతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని వసతులు కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.