ఖమ్మం: అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్

4చూసినవారు
ఖమ్మం: అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్
ఖమ్మం నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని శనివారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, కేఎంసీ కమీషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి తనిఖీ చేశారు. ఎస్ఆర్ అండ్ బీజిఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరిసర ప్రాంతంలో ఫుట్‌పాత్ నిర్మాణంలో గ్రానైట్ రాళ్లతో ఏర్పాటు చేసే పనులు, టైల్స్ డిజైన్‌లను పరిశీలించి సూచనలు చేశారు. ఫుట్‌పాత్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ప్రజలకు సౌకర్యవంతంగా, భద్రతతో ఉండేలా నిర్మించాలని, పిల్లలు, వికలాంగులు, వృద్ధులు సైతం ఇబ్బంది లేకుండా నడిచే విధంగా పనులు చేపట్టాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్